మంగాపురానికి బ్రహ్మోత్సవ శోభ - chandragiri
శ్రీనివాస మంగాపురంలో వెలసిన బ్రహ్మాండ నాయకుడు శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురంకల్యాణ వెంకటేశ్వరస్వామిబ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి.తిరుమల తరహాలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులుఏర్పాట్లుచేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామి వారికి వాహన సేవ చేస్తారు. నేడుఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్నిసుందరంగా తీర్చిదిద్దారు.