గ్రాసం లేక పశువులను ఇంటి వద్దే ఉంచి తవుడును ఆహారంగా అందిస్తున్నందున జీవాలు వ్యాధుల బారిన పడుతున్నాయి. వివిధ రకాల వ్యాధులతో మృతి చెందిన జీవాల మృతదేహాలను అమాయకులైన కాపరులు చెట్లకు వేలాడదీస్తారు. ఇది వారి ఆనవాయితీ. దీని వల్ల కూడా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల చొరవ చూపి తమకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
నీరు మాయం.... పశుపోషణ భారం - animals
చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. తంబళ్లపల్లె, మదనపల్లె ,వాల్మీకి పురం, పలమనేరు, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పశుగ్రాసం లభించక ప్రాణాలు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి.
మూగజీవాల గోడు
స్థానిక ప్రజలే కాక మహ్మద్ ప్రవక్తను స్మరిస్తూ అజ్మీర్ నుంచి కర్ణాటకలోని మూరుగమల్లె పవిత్ర స్థలానికి ఒంటెలతో వెళ్తున్న రాజస్థానీయులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి వెంట తీసుకువచ్చే ఒంటెలకు ఈ ప్రాంతంలో గ్రాసం లభించడక అవస్థలు పడాల్సి వస్తోంది.