చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ రహదారి వరుస ప్రమాదాలతో హడలెత్తిస్తోంది. నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో అనంతపురం నుంచి ఒంగోలుకు కెమికల్ రాళ్లతో వెళుతున్న లారీ అదుపుతప్పి 200 అడుగుల లోతులోని లోయలోకి పడిపోయింది. ఆ రాళ్లు మొత్తం క్యాబిన్ పై పడిపోవడంతో అందులో ఉన్న డ్రైవర్ మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికి తీయడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
కనుమ దారిలో రెండు లారీలు బోల్తా.. - రోడ్డు ప్రమాదం
చంద్రగిరి మండలం లోని భాకరాపేట కనుమ రహదారిలో వరుస ప్రమాదాలు జరిగాయి. రాళ్ల లోడుతో వెళుతున్న లారీ..అదుపుతప్పి 200 అడుగుల లోతులోని లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ రాళ్లు మొత్తం క్యాబిన్ పై పడిపోవడంతో అందులోని డ్రైవర్ మృతి చెందాడు. టమాటా లోడుతో వెళుతున్న లారీ అదే రహదారి కనుమ మలుపు వద్ద బోల్తా పడింది.
రోడ్డు ప్రమాదం
ఇది ఇలా ఉండగా దానికి సమీప ప్రాంతంలో మదనపల్లి నుంచి చెన్నైకి టమోటాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ కనుమదారిలో మలుపులు ఎక్కువగా ఉండటం.. మలుపుల వద్ద రక్షణ గోడ లేకపోవడంతో ఈ ప్రమాదాలకు కారణం అవుతుందని వాహనచోదకులు అంటున్నారు.
ఇదీ చదవండి:accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి