ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొట్టిన బస్సు.. 20మందికి గాయాలు - 20మందికి

చిత్తూరు జిల్లా  తిరుపతి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సి. మల్లవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

లారీని ఢీకొట్టిన బస్సు.. 20మందికి గాయాలు

By

Published : May 22, 2019, 10:33 AM IST

Updated : May 22, 2019, 11:53 AM IST

లారీని ఢీకొట్టిన బస్సు.. 20మందికి గాయాలు

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై సి. మల్లవరం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. నాయుడుపేట నుంచి బెంగళూరుకు ఖాళీ గాజు గ్లాసులతో వెళుతున్న లారీ రోడ్డు పక్కన ఆపి ఉంచగా.. రాజమండ్రి నుంచి బెంగుళూరుకు వెళుతున్న ప్రైవేటు వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 22, 2019, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details