ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిపై వెలసిన శ్రీకుమారస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీవల్లి, దేవసేన సమేతంగా కుమారస్వామి వారు మాఢవీదుల్లో ఊరేగారు. స్థానికులే కాక బయట ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చినవారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆడికృత్తిక.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం - కుమార స్వామి
శ్రీకాళహస్తిలోని కుమారస్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీసమేతంగా స్వామివారు మాఢవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆడికృత్తిక.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం