కానిపాకం బొజ్జగణనాథుని గురించి అర్చకులు చెప్పిన మాటలు...కానిపాకం గణనాథుడు వెలసిన కానిపారకం... అనే గ్రామం క్రమేపి కానిపాకంగా వృద్థి చెందిందని... దేవస్థాన అర్చకులు చెపుతున్నారు. ఆ వినాయకుడు వెలసిన ప్రాంతంలో రక్తం ఏరులై పారేదని... భక్తులు కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు చేయడంతో రక్తం ఆగిందని భక్తుల విశ్వాసం. కాలంతోపాటు గణనాథుడు పెరుగుతూ ఉంటాడని దానికి నిదర్శనమే.. స్వామివారికి కవచాలని అర్చకులు తెలియజేశారు.. గరికతో పూజిస్తేనే ఆ బొజ్జగణనాథునికి నచ్చుతుందట! అందుకనే 9రకాల ఔషధ గుణాలు కలిగిన ఆకులతో స్వామిని పూజించడం వలన అటు పర్వావరణానికీ మేలు జరుగుతుందని చెబుతున్నారు. 21రోజుల పాటు జరిగే నవరాత్రులలో భక్తులు అంతా పాల్గొని పుణీతులు కావాలని అర్చకస్వాములు స్వాగతించారు...
కానిపాకం గణనాథుడిపై ఆసక్తికర విషయాలు - గణనాథుడి
విఘ్నాలను తొలగించే ఏకదంత రూపిగా, సత్యదేవుడిగా పిలుచుకునే కానిపాక వరసిద్ద వినాయక ఆలయంపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానిపాకం గణనాథుని గురించి ఆ దేవస్థాన అర్చకులు ఏమంటున్నారో మీరు తెలుసుకోండి.
కానిపాకం గణనాథుడి గురించి ... ఆసక్తికర విషయాలు