పవిత్ర తిరుమల క్షేత్రాన్ని తమిళనాడుకు చెందిన వ్యక్తి.. మద్యం, మాంసంతో అపవిత్రం చేసి.. అధికారులకు దొరికిపోయాడు. విషయం.. విజిలెన్స్ అధికారులకు తెలియగా.. దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. తిరుమలలోని ఓ టీ దుకాణంలో పనిచేసే ఈ వ్యక్తిని.. తమిళనాడు మధురైకి చెందిన కుమార్‌గా గుర్తించారు. తెల్లవారుఝామునే.. కొండపైకి చేరుకున్న కుమార్.. అనుమానాస్పదంగా వ్యవహరించాడు. గుర్తించిన భద్రతా సిబ్బంది.. అతడిని తనిఖీ చేశారు. 5 మద్యం సీసాలు.. కేజీ మాంసాన్ని కాళ్లకు కట్టుకుని తీసుకువెళ్తున్నట్టుగా గుర్తించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో పట్టుబడని కుమార్ తీరు.. తిరుపతిలో నిఘా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఈ విషయంలో.. భక్తులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు.
తిరుమలకు మద్యం, మాంసం.. తమిళుడి నిర్వాకం! - non veg
ఓ వ్యక్తి తిరుమలకు మద్యం, మాంసాన్ని తీసుకొచ్చాడు. గమనించిన తితిదే విజిలెన్స్ సిబ్బంది అతడ్ని పట్టుకున్నారు. తమిళనాడు మధురైకి చెందిన కుమార్ గా అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ttd