ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడేళ్ల బాలికపై తాపీమేస్త్రీ అత్యాచారయత్నం - 55 ఏళ్ల వ్యక్తి

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ శివారులోని ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

నిందితుడిని చూపిస్తున్న గ్రామస్థులు

By

Published : Jul 6, 2019, 4:46 PM IST

నిందితుడిని విచారిస్తున్న గ్రామస్థులు

ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం శివారులోని ఎర్రమ్మరెడ్డిగుట్టలో చోటు చేసుకుంది. ఎరమరెడ్డిగుట్టలో నివాసముంటున్న ఓ కుటుంబ యజమాని ఇటీవల ద్విచక్ర వాహనం నుంచి కిందపడి గాయపడ్డాడు. తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో భర్తతో పాటు భార్య ఉండగా.. వారి ముగ్గురు పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే మిద్దెపై బట్టలు తీసుకువచ్చేందుకు వెళ్లిన బాలికపై.. తాపీమేస్త్రి రవి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఎంతకూ తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ చిన్నారి బంధువులు మిద్దెపైకి వెళ్లి చూడగా.. రవి వ్యవహారం బయటపడింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో రవిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. బాలిక బంధువుల సమక్షంలో విచారించగా జరిగిన విషయం తెలిసింది. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details