రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిత్తూరు జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, తిరుపతి, సదుం, పాకాల, కల్లూరుకు చెందిన 78 మంది మార్చి 13న మత ప్రార్థనల కోసం అజ్మీర్ దర్గాకు వెళ్లారు. మార్చి 24న తిరుగు ప్రయాణానికి సిద్ధంకాగా.. అంతలోనే లాక్‌డౌన్ ప్రకటించారు.
అప్పటి నుంచి అక్కడే చిక్కుకున్నామని ‘ఈనాడు - ఈటీవీ భారత్’ కు చెప్పి ఆవేదన చెందారు. వీరిలో 50 మందికిపైగా మహిళలే ఉండగా.. కొందరికి మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉన్నాయి. తమను స్వస్థలాలకు చేర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. అజ్మీర్ లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.