ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధురాలి హత్య... బావిలో పడేసి మృతదేహానికి నిప్పు... - piler

వృద్ధురాలిని చంపేసిన దుండగులు... బావిలో పడేశారు. ఆపై గ్యాస్‌ సిలిండర్‌ అందులో వేసి నిప్పు పెట్టారు. ఇంతకీ ఇది ఎవరి పని... ఎందుకింత పని చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధురాలి మృతదేహం వద్ద ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

By

Published : Jun 26, 2019, 9:58 AM IST

చిత్తూరు జిల్లా పీలేరులోని ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న72ఏళ్ల వృద్ధురాలు రంగమ్మ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం ఇంటి ఆవరణంలోని బావిలో పడేశారు. ఆమె పడుకునే పరుపులో చుట్టేసి... నూతిలో విసిరేశారు. ఆపై గ్యాస్‌ సిలిండర్‌ వేసి నిప్పు పెట్టారు. వృద్ధురాలు మృతదేహం సగం కాలిపోయింది.

ఎంతసేపటికి వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు రాకపోయేసరికి స్థానికులు... అనుమానం వచ్చి చూస్తే ఆమె మృతదేహం కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు... వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకుని పరిశీలించింది. వాసన పసిగట్టిన పోలీసులు జాగిలం...ఇంటి బయటకొచ్చి మదనపల్లి రోడ్డు వెంట పరుగులు తీసింది.
75ఏళ్ళ రంగమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీళ్లంతా వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తున్నారు. భర్తలేని రంగమ్మ ఒంటరిగా ఇంట్లో నివసిస్తోంది.

వృద్ధురాలి హత్యకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details