అమరాజ్ బ్యాటరీస్ గ్రూప్ అధినేత గల్లా రామచంద్రనాయుడు నిర్వహిస్తున్న రాజన్న ట్రస్టు ద్వారా 100 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయిలు విరాళంగా ఇచ్చారు. 1913లో ప్రారంభమైన ఈ పాఠశాలకు శతాబ్ధ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూర్వవిద్యార్థులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. విరాళంగా వచ్చిన డబ్బుతో పాఠశాలకు కమ్యూనిటీ హాల్, వంటశాల, మినరల్ వాటర్ ప్లాంట్ సమకూర్చినట్లు గల్లా రామచంద్రనాయుడు కుమార్తె గల్లా రమాదేవి తెలిపారు. అప్పుడు నేర్చుకున్న విద్యాబుద్ధులతోనే ఇప్పుడు ఉన్నత శిఖరాలు అధిరోహించామని పూర్వవిద్యార్థులంతా గర్వంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
పాకాల ఉన్నత పాఠశాలకు 100 ఏళ్లు - 100 సంవత్సరాలు
100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రభుత్వ పాఠశాల వేడుకలు చిత్తూరు జిల్లా పాకాలలో ఘనంగా నిర్వహించారు.పూర్వవిద్యార్థులంతా కలసి పాఠశాలకు సుమారు కోటి రూపాయిల విరాళంగా అందజేశారు.
పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో కార్యక్రమంలో అలరిస్తున్న చిన్నారుల నృత్యాలు
ఇదీ చూడండి