ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అతిరథ మహారథుల మధ్య, అశేష జన సందోహం నడుమ ఈ వేడుక వైభవంగా జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక నెరవేరిన వేళ తల్లి కంటతడి పెట్టుకున్నారు. కన్నీళ్లను అదుపు చేసుకునేందుకు విజయమ్మ ప్రయత్నించినా... ఆ ఆనందభాష్పాలు ఆగలేదు. గమనించిన జగన్.... వెంటనే తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అప్పుడు ఆ తల్లి హృదయం శాంతించింది. వేదికపై ఈ దృశ్యం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్ - ys jaganmohan reddy
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలన్న కల నెరవేరిన వేళ ఆనందభాష్పాలు రాల్చారు. తల్లిని హత్తుకుని జగన్ ఓదార్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోని ఈ దృశ్యం... పుత్రోత్సాహాన్ని కళ్లకు కట్టింది.
విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్