కృష్ణా జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని రమేష్ సంస్థ నిర్మించిన ఐ.జే.ఎం టౌన్షిప్లో అక్రమంగా లేఔట్లు, వెంచర్లు వేశారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. విజయవాడ వైకాపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన...నిబంధనలను పాటించకుండా, సుమారు 40 ఎకరాల్లో లే ఔట్లు వేశారని ఆరోపించారు. విలాసవంతమైన విల్లాలు కట్టి, ఒక్కో విల్లాను రూ.5 కోట్లకు అమ్ముకున్నారన్నారు. బిల్డింగ్ పర్మిట్, లే ఔట్ ఫీజులు కట్టకుండా వెంచర్లు వేశారన్నారు. కాజ గ్రామ పంచాయతీ రావాల్సిన సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల ఫీజు ఎగవేశారని ఆళ్ల రామకృష్ణ రెడ్డి చెప్పారు.
'లింగమనేని ఐ.జే.ఎం టౌన్షిప్పై విచారించాలి' - Lingamaneni ventures
మంగళగిరిలోని ఐ.జే.ఎం టౌన్షిప్లో అక్రమ లేఔట్లు, వెంచర్లు వేశారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. తెదేపా హయాంలో లింగమనేని రమేష్‌కు అక్రమంగా భూములు కట్టబెట్టారన్నారు. ఐ.జే.ఎంలో నిర్మించిన టౌన్షిప్లకు సంబంధించి పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించలేదన్నారు. వీటిపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని సీఎంను కోరుతానన్నారు.
లింగమనేని ఐ.జే.ఎం టౌన్షిప్పై విజిలెన్స్ దర్యాప్తు
పంచాయతీ చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకుండా తిరిగి...వారిపైనే కేసులు వేశారన్నారు. తెదేపా హయాంలో జరిగిన భూ దందాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి విజిలెన్స్ దర్యాప్తు కోరుతామన్నారు. 2010లో లింగమనేని రమేష్ ఈ టౌన్‌షిప్‌లను ఐజేఎంకు అప్పగించినట్లు తెలిపారు. మంగళగిరి పరిసరాల్లో సుమారు 250 ఎకరాలు అక్రమంగా పొందారని ఆరోపించారు.
ఇదీ చదవండి :విజయవాడలో ట్రాఫిక్ కష్టాలపై ప్రభుత్వం దృష్టి