రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభినందనీయమని వైకాపా ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కేటాయింపులు ఉన్నాయన్నారు. నవరత్నాల హామీలను అమలు చేసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఉందని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. 11 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తెదేపా మాజీ మంత్రి యనమల చేసిన వాఖ్యలపై... చర్చకు రవాలని సవాలు విసిరారు.
ప్రజల అవసరాలు తీర్చేలా.. బడ్జెట్: వైకాపా
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలువురు వైకాపా ప్రజాప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజల అవసరాలు తీర్చేదిగానే ఉందని అభిప్రాయపడ్డారు.
వైకాపా ప్రజాప్రతినిధులు