ప్రచారమే తప్ప పసలేని బడ్జెట్ ఇది: యనమల - budget
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై యనమల అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు అమాంతం పెంచారంటూ... గత ప్రభుత్వంపై మాట్లాడి మళ్లీ ఎలా అప్పులు తెస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. అన్ని పథకాలకు వైఎస్సార్, జగన్ పేర్లు తప్ప... వేరే నాయకుల పేర్లే లేవా అని మండిపడ్డారు.
శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన 2019-20 బడ్జెట్‌పై యనమల రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ...పస తక్కువ అని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి గత తెదేపా ప్రభుత్వంపై ఎన్నో మాట్లాడి...సుమారు 48 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధపడ్డారన్నారు. వడ్డీలేని రుణాలపై అసెంబ్లీలో చాలా హడావుడి చేసి 100 కోట్లే కేటాయించారని మండిపడ్డారు. సాంఘిక సంక్షేమానికి నిధులు బాగా తగ్గించారని ఆరోపించారు. జలవనరులశాఖకు వెయ్యి కోట్ల నిధులు తగ్గించారని... వ్యవసాయ రంగానికీ అంతంత మాత్రమే కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నీటికి వైస్సారేనా...!
అన్ని పథకాలకు వైఎస్ఆర్, జగన్ పేర్లే పెడుతున్నారని... పేర్లు పెట్టేందుకు రాష్ట్రంలో ఇంకెవరూ నాయకులు లేరా? అని ప్రభుత్వాన్ని యనమల ప్రశ్నించారు.