ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ సబ్ కమిటీలో వేయడం దురుద్దేశపూర్వక చర్యని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉన్నాయన్నారు. స్వర్ణయుగాన్ని చీకటి పాలన అనడం జగన్ అవగాహనారాహిత్యమని యనమల ఎద్దేవా చేశారు. తెదేపా నేతలను అప్రతిష్ట పాల్జేసే ప్రయత్నాలు చేస్తే ప్రజలే తిప్పికొడతారన్నారు.
జగన్ సహా 26 మంది కేబినెట్లో 17 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదికి వెల్డడించిందిని తెలిపారు. 9 మంది మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు, 151 మంది వైకాపా ఎమ్మెల్యేలకుగాను 88 మందిపై కేసులున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిన్న జారీచేసిన జీవో నెం 1411 హాస్యాస్పదంగా ఉందన్న యనమల...తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ కార్యకలాపాలపై విచారణకు ఆదేశించడం ద్వారా ఆయా శాఖల్లో అభివృద్ధి, సంక్షేమ పనులు జరగకుండా స్థంభింప చేయడమే ఈ జీవో సారాంశమన్నారు.
మంత్రుల కమిటీలో ఎంపీలా...? - యనమల - jagan sub commity
కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉన్నాయని తెదేపా నేత యనమల అన్నారు. మంత్రుల కమిటీలో ఎంపీలు ఎలా వస్తారని ప్రశ్నించారు. జగన్ కమిటీలు వేసి రాష్ట్రాన్ని చీకటి చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.
యనమల రామకృష్ణుడు
ఇదీ చదవండి