నియామకాలన్నీ ఆ సామాజికవర్గానికేనా...: యనమల - tdp
ప్రస్తుత ప్రభుత్వంలో రాజకీయ నియామకాలన్నీ ఓ సామాజికవర్గంతో నింపేస్తున్నారని శాసనమండలిలో తెదేపా పక్షనేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేషన్లు, కమిటీలు అన్నింటిలో రెడ్డి వర్గీయులే కనిపిస్తున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరిగిన నియామకాలను చదివి వినిపించారు.
yanamala
ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార పత్రాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫోటో ఎలా ఉంచుతారని శాసనమండలిలో తెదేపాపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించడమేనని అన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ..... ప్రభుత్వానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు లేదని ఉద్ఘాటించారు