ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశ్రాంత ఉద్యోగికి బదిలీ ఉత్తర్వులు...! - guntur

ఉద్యోగం చేస్తున్న వారికి బదిలీ ఉత్తర్వులు ఇవ్వటం మామూలే... కానీ పదవీ విరమణ చేసిన అధికారికి ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది... ఇదేమి అనుకుంటున్నారా ... అలాంటి ఉదంతం స్త్రీ, శిశుసంక్షేమ శాఖలో చోటు చేసుకుంది.

విశ్రాంత ఉద్యోగికి బదిలీ ఉత్తర్వులు...!

By

Published : Jul 12, 2019, 12:48 AM IST

ఉద్యోగం చేస్తున్న వారికే కాకుండా... విరమణ చేసిన అధికారులకు బదిలీ చేసే స్థాయికి అధికారుల నిర్లక్ష్యం చేరుకుంది. గుంటూరులోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తూ యు .సంధ్యారాణి అనే అధికారి రెండు సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. అయితే గురువారం విడుదల చేసిన అధికారుల బదిలీల్లో ఆమె పేరూ ఉండటం విస్మయానికి గురిచేసింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సీడీపీవోలను బదిలీలు చేసే క్రమంలో 21మందికి వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగులు ఇస్తూ స్త్రీ, శిశు సంక్షేమశాఖ సంచాలకులు కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. వీరిలో యు.సంధ్యారాణి అనే అధికారి తెనాలిలో అసిస్టెంట్​ సీడీపివోగా పని చేస్తున్నట్లు ... ఆమెను వినుకొండకు సిడీపివోగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. అంతే కాదు వారం రోజుల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ బదిలీ ఉత్తర్వులు ఏదో ఆఫీసులో కూర్చుని ఇచ్చినవి కాదు.... ఈనెల 8, 9 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి మరీ ఆదేశాలు జారీ చేశారు.

విశ్రాంత ఉద్యోగికి బదిలీ ఉత్తర్వులు...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details