కేఈ కుటుంబంతో ముగిసిన సీఎం భేటీ తెదేపాలో
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో డోన్ నియోజకవర్గ విషయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీ ముగిసింది. తెదేపాలోకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికపై తమ అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి కేఈ సోదరులు తీసుకెళ్లారు. కేఈ కుటుంబానికి ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని సీఎం హామి ఇచ్చారు. సీఎం సమావేశంతో సంతృప్తి చెందామని, కోట్ల కుటుంబంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేఈ సోదరులు తెలిపారు. జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచేలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. చంద్రబాబు సూచనల మేరకు పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. సీట్ల విషయంలో ఎవరెక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు.