రాష్ట్ర విభజనతో తెలుగు రాష్ట్రాల్లో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ....ఇప్పుడు మళ్లీ పుంజుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించిన హస్తం పార్టీ....క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే ఆ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకుని- తమతోనే హోదా సాధ్యమవుతుందనే భరోసాను ప్రజల్లో కల్పించేందుకు యాత్రలు నిర్వహిస్తోంది.ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి....కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారుకేంద్రంలో యూపీఎ అధికారంలోకి రాగానే ఆంధ్రుల ప్రత్యేక హోదా కలను సాకారం చేయడంతో పాటు ఇతర హామీలను అమలు చేస్తామని ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా నాలుగుసార్లు రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. కేంద్రంలో అధికారంలోకివస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతంకం చేస్తామని ప్రకటించడం ద్వారా ఏపీకి కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నమన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర నాయకత్వం కూడా ప్రత్యేక హోదానే ఎన్నికల అజెండాగా సిద్ధం చేసుకుని ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసుకుంది.ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అభ్యర్థుల ఎంపికను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం ద్వారా....ప్రజాక్షేత్రంలో మరోవిడత ప్రచార పర్వానికి తెరతీసేందుకు సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి 1300 దరఖాస్తులు వచ్చాయని...పీసీసీ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందని కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. బలమైన నాయకులను ఎన్నుకోవడం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంన్నారు.ఈసారి ఎన్నికల్లో గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హస్తం శ్రేణులు అవసరమైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సైతం ప్రచార బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు.ఇదీ చదవండి