ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైఎస్ ఆత్మ వచ్చి..మాట్లాడండని చెప్పిందేమో' - ఆంధ్రప్రదేశ్

తెదేపా ప్రభుత్వం హయంలో..కియా..కియా.. అంటుండేవారని..వాస్తవానికి ఆ సంస్థ...సీఈవో 2007లోనే వైఎస్​కు లేఖ రాసిందని మంత్రి బుగ్గన అన్నారు. ఈ విషయంపై స్పందింస్తూ...వైఎస్ ఆత్మ వచ్చి చంద్రబాబుతో మాట్లాడండి అని చెప్పిందా?అని ప్రతిపక్షనేత..బుగ్గనను ప్రశ్నించారు.

war_about_kia_motors_in_assembly_between_minister_buggana_and_chandrababu

By

Published : Jul 16, 2019, 1:00 PM IST

పరిశ్రమ వచ్చిందన్నా.. ఉద్యోగాలు వచ్చాయన్నా అన్నింటికీ కియా వల్లే వచ్చాయని తెదేపా గొప్పలు చెప్పిందని మంత్రి బుగ్గన విమర్శించారు. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వినతి మేరకే కియా పరిశ్రమ తీసుకొచ్చామని కంపెనీ ప్రతినిధులే చెప్పినట్లు తెలిపారు. స్వయంగా కంపెనీ ప్రతినిధులు రాసిన లేఖను చూపిస్తున్నా... దాపరికం లేదంటూ లేఖను చూపించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. 'బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చాలా తెలివైనవారు. 2009లో రాజశేఖర్​ రెడ్డి చనిపోయారు. ఆయన ఆత్మ 2016లో సీఈవో దగ్గరు వెళ్లి...కియా పెట్టండి..ఆయన ఇన్సెంటివ్స్​ ఇస్తారు..అని చెప్పిందా?' అంటూ చంద్రబాబు అని ప్రశ్నించారు.

'వైఎస్ ఆత్మ వచ్చి..మాట్లాడండని చెప్పిందేమో'

ABOUT THE AUTHOR

...view details