ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని స్థాయికి తగిన మాటలు మాట్లాడాలి: వర్ల రామయ్య - విమర్శలు

కర్నూలు సభలో ప్రధాని నరేంద్రమోదీ అసంబద్ధంగా మాట్లాడారని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును హేళన చేస్తూ మాట్లాడడం ప్రధాని స్థాయికి తగదని అన్నారు.

వర్ల రామయ్య

By

Published : Mar 30, 2019, 12:15 AM IST

వర్ల రామయ్య
కర్నూలు సభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన తీరు బాలేదని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును హేళన చేస్తూ మాట్లాడడం ప్రధాని స్థాయికి తగదని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు ఇచ్చి.. ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. విజయ్​ మాల్యా, నీరవ్ మోదీలకు సాయం చేసింది మీరు కాదా.. అని నిలదీశారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి మీరు ఏమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details