రాజ్యసభ ఛైర్మన్‌ను కలవనున్న తెదేపా ఎంపీలు - letter
తెదేపా పక్షాన్ని భాజపాలోకి విలీనం చేయడాన్ని పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించిన లేఖను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఇవ్వనున్నారు.
తెదేపా ఎంపీలు
తెదేపాకు చెందిన నలుగురు ఎంపీలు నిన్న భాజపా కండువా కప్పుకుని... రాజ్యసభలో తెదేపా పక్షాన్ని కమల పార్టీలోకి విలీనం చేసేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇవాళ పూర్తయింది. దీనిని తెదేపాలో మిగిలిన ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. తెదేపా పక్షం విలీనం చెల్లదంటూ లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి... తమకు కొంత సమయం కావాలని మధ్యాహ్నం రాజ్యసభలో వెంకయ్యనాయుడిని కోరారు.