అమరావతిలో తెదేపా ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం ముగిసింది.
మేనిఫెస్టో వివరాలను వెల్లడిస్తున్న మంత్రి మేనిఫెస్టోలో ముఖ్యంగా సంక్షేమం, రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలుకు ప్రాధాన్యమిస్తామని కమిటీలో సభ్యుడైన మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూనే.. ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 3.78 లక్షల రూపాయలకు పెంచేలా మేనిఫెస్టోను రూపకల్పన చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. వీటి కోసం ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు. 2104 ఎన్నికల అజెండాలో హామీలన్నీ అమలు చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనన్నారు. మార్చి మొదటి వారానికల్లా మేనిఫెస్టో పూర్తయ్యేలా ప్రయత్నిస్తామని తెలిపారు.