ప్రోటెం స్పీకర్ అప్పలనాయుడు నూతన ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయించారు. సభలో 175మంది ఎమ్మెల్యేలకు గాను 173మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వ్యక్తిగత కారణాలతో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.
ఒక్కరు మినహా.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి - జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభలో 175మంది ఎమ్మెల్యేలకు గాను 173మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేక పోయారు.
swearing_complted_in_ap_assembly
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మొదట నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేరిట అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం వ్యక్తులపై ప్రమాణ స్వీకారం చెల్లదన్న అధికారులు... మరోసారి చివరిలో కోటంరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.