నేడు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతవారణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించొచ్చని స్పష్టం చేశారు. కోస్తా జిల్లాల్లో మరో 2 రోజులపాటు ఈ తీవ్రత ఉంటుందని అంచనా వేశారు. రానున్న 4 రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి, ఒడిశాను ఆనుకుని దక్షిణ చత్తీస్ఘడ్ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఉందని అధికారులు వివరించారు.
జూన్ రెండో వారంలో రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు జూన్ 8,9 తేదిల్లో రాయలసీమను తాకే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు స్పష్టం చేశారు. జాన్ 4,5వ తేదిన కేరళను తాకి తర్వాత మరో నాలుగైదురోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. తొలుత రాయలసీమ జిల్లాల్లో రుతుపవనాలు ప్రభావం చూపి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు.
రాష్ట్రంలో నేడూ.. భానుడి భగభగలు - sun stroke
రాష్ట్రంలో నేడూ..భానుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో నేడూ.. భానుడి భగభగలు