అమరావతిలో ఘనంగా ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు - amaravathi
ఈ నెల 26న అమరావతిలో ప్రారంభమైన రాష్ట్ర ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు ఇవాళ ఘనంగా ముగిశాయి. సీఐడీ ఎస్పీ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
అమరావతి బ్యాడ్మింటన్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈనెల 26న ప్రారంభమైన ఈ పోటీలలో సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులు, మహిళలు, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. చివరి రోజు జరిగిన మ్యాచ్ లో పురుషుల విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన జశ్వంత్, మహిళల విభాగంలో ప్రకాశం జిల్లాకు చెందిన ప్రణవి, మెన్ప్ డబుల్స్ లో జగదీష్, చంద్రకుమార్, వుమెన్స్ డబుల్స్ లో అక్షిత, ప్రీతి విజయం సాధించారు. విజేతలకు సీఐడీ ఎస్పీ శ్రీకాంత్ బహుమతులు ప్రదానం చేశారు. బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఏటా ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని అమరావతి బ్యాడ్మింటన్ అసిసోయేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.