నూతన సభాపతి తమ్మినేని సీతారాం శాసనసభ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు సభాపతి సవాళ్లను అధిగమిస్తాననే నమ్మకం కలిగిందని... అయితే సభ్యుల తీరు చూశాక బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నైతిక విలువలు పెంపొదించాల్సిన అవసరముందని అన్నారు. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని వాటిపైన చర్చించాలని సభ్యులకు సూచించారు. అవినీతిరహిత పాలన అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని... నిరక్షరాస్యత, వలసల నివారణపై చర్చలు సాగిద్దామని హితవు పలికారు.
'విలువలు పాటించండి... సమస్యలపై చర్చించండి ' - behaviour
అసెంబ్లీలో సభ్యుల తీరుపై సభాపతి తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకూడదని... ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.
శాసనసభ నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని... వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అందిరపై ఉందని వివరించారు. సభ గౌరవంపై శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని వెల్లడించారు. పతనావస్థకు చేరుకున్న వ్యవస్థలో విలువలు నెలకొల్పాలని పిలుపునిచ్చారు. శాసనసభ సభ్యుల నిర్ణయాలను కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చలు జరుపుతూ రాష్ట్ర శాసనసభను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని సభ్యులను సభాపతి తమ్మినేని సీతారాం కోరారు.