ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేసవి రైళ్లకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌

వేసవి సెలవుల నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లో రద్దీ దృష్టిలో పెట్టుకుని 68 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఆన్​లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్నీ కల్పించింది

రైలు

By

Published : Mar 10, 2019, 10:34 AM IST

Updated : Mar 10, 2019, 10:39 AM IST

ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 68 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హెచ్​.ఎస్నాందేడ్ - తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. తిరుపతినుంచి నాగర్ సోల్ మధ్య 8 రైళ్లు, తిరుపతి నుంచి కాకినాడ టౌన్ మధ్య అన్ని జనరల్ బోగీలతో నడిచే 10 జన్ సాధారణ్ రైళ్లను ఏర్పాటు చేశారు. కాకినాడ టౌన్- రాయచూర్ - కాకినాడ టౌన్ మధ్య వారంలో 3 రోజుల పాటు 26 రైళ్లు పరుగులు తీయనున్నాయి. కాకినాడ టౌన్ నుంచి కర్నూలు- కాకినాడ టౌన్ మధ్య వారంలో రెండు సార్లు తిరిగేలా 16 రైళ్లను కేటాయించారు. ప్రత్యేక రైళ్లన్నీ ఏప్రిల్ నుంచి జూన్ వరకు పలు తేదీల్లో నడువనున్నాయి. ఆన్ లైన్ ద్వారారిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు
Last Updated : Mar 10, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details