తిరుగు పయనమైన ఓటర్లకు.. ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు ఓటు వేయడానికి సొంతూళ్లకు వచ్చిన వారందరూ తిరుగు పయనమవుతున్నారు. వీరి కోసం రైల్వే, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. రేపు ఎక్కువమంది తిరిగి వెళ్తారని భావించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు 492 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు 244, బెంగళూరుకు 492, చెన్నైకు 49 బస్సులు సిద్ధం చేశారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రద్దీ మేరకు అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు పెంచుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రత్యేక రైల్వే సర్వీసులు
ఇప్పటికే వేసవి దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే... రేపు కాకినాడ - సికింద్రాబాద్ మధ్య మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడపనుంది.ఓటు వేసేందుకు వచ్చినవారి తిరుగు ప్రయాణానికి ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి. రద్దీ దృష్ట్యా కాకినాడ-సికింద్రాబాద్ ఆదివారం2ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు.రేపు రాత్రి9గం.కు కాకినాడ- సికింద్రాబాద్ జన్ సాధారణ్ రైలు.. అన్ని జనరల్ బోగీలతో అందుబాటులోకి రానుంది. రేపు రాత్రి9.45గంటలకు కాకినాడనుంచిసికింద్రాబాద్ ప్రత్యేక రైలు బయలుదేరనుంది.సామర్లకోట, ద్వారంపుడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, మధిర, ఖమ్మం, ఖాజీపేట మీదుగా రైలు నడుస్తుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
ఇదీ చదవంఈసీ డౌన్ డౌన్.... వెల్లువెత్తిన జనాగ్రహం..