ఎన్నికల నిబంధనల కారణంగా మంత్రిగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి ఉత్సవవిగ్రహం లాగా మిగిలిపోతున్నామని అన్నారు. వ్యవసాయశాఖపై రెండు మూడురోజుల్లో సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. సమీక్షకు సంబంధించి ఎవరి అనుమతి తీసుకోనన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం తనను నిరోధిస్తే ఆ క్షణమే మంత్రి పదవి నుంచి వెదొలుగుతానన్నారు. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వ్యాఖ్యనించారు.
ఆ క్షణమే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : సోమిరెడ్డి - vijayawada
రెండుమూడు రోజుల్లో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తమను ఎన్నికల సంఘం నిరోధిస్తే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.
సోమిరెడ్డి