తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లిలో నవవధువు పాము కాటుకు గురై చనిపోయింది. బోరవెల్లి గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతను.. వనపర్తి జిల్లా ద్వారకా నగర్ వాసి అశోక్‌కు ఈ నెల 23న పెళ్లి జరిగింది. మంగళవారం రాత్రి కరెంటు పోవడం వల్ల ఇంటి బయట నిద్రించారు. ఏమో కొరికినట్టు అనిపించిందని భర్త, తండ్రికి చెప్పింది శ్రీలత. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. వివాహం జరిగిన మూడు రోజులకే ఇలా చనిపోవడం వల్ల బంధువుల రోదనలు మిన్నంటాయి.
బోరవెల్లిలో విషాదం.. నవ వధువును కాటేసిన పాము - jojulamba gadhwal district
కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందింది. పెళ్లైన మూడు రోజులకే పాము కాటుతో చనిపోయింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది.
నవ వధువును కాటేసిన పాము