మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఇంటికి భద్రతను కుదించిందీ ప్రభుత్వం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 12 మంది పోలీసు సిబ్బంది బందోబస్తుగా ఉండేవారు. ప్రభుత్వం మారినందున ఇక్కడ భద్రత తొలగించి... స్థానిక చంద్రగిరి పోలీస్ స్టేషన్కు చెందిన ఒక్కరినే కాపలాగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏపీఎస్పీ బెటాలియన్, చంద్రగిరి పోలీసులు కలిసి బందోబస్తు నిర్వహించేవారు. ఇప్పుడు ఏపీఎస్పీ పోలీసు భద్రత తొలగించి చంద్రగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కరినే బందోబస్తుగా నియమించారు
నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి భద్రత కుదింపు - chandra babu
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో ఇంటి భద్రతను కుదించారు. అధికారంలో ఉన్నప్పుడు 12 మంది సిబ్బంది బందోబస్తు ఉండేవారు... ఇప్పుడు ఒకరిని మాత్రమే ఉంచారు.
నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి భద్రత కుదింపు