రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయం, సహకారశాఖ ముఖ్యకార్యదర్శిగా బి.రాజశేఖర్ ను నియమించారు. ఆయనకు రియల్ టైమ్ గవర్నెన్స్ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా డి.వరప్రసాద్ నియమిస్తూ...కార్మికశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ - ఐఏఎస్‌ల బదిలీ
రాష్టంలో 11 మంది ఐఏఎస్, ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ias
శాఖలవారిగా బదిలీ అయిన అధికారుల వివరాలు..
శాఖ | అధికారి పేరు |
వ్యవసాయం, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి | బి.రాజశేఖర్ |
పౌరసరఫరాలశాఖ కమిషనర్ | డి.వరప్రసాద్ |
దివ్యాంగుల సంక్షేమం, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ | కిశోర్ కుమార్ |
ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ | మాధవీలత |
సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి | పి.లక్ష్మీనరసింహం |
చేనేత, జౌళిశాఖ కార్యదర్శి | శ్రీనివాస శ్రీనరేశ్ |
సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి | లావణ్య వేణి |
పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ | విజయ సునీత |
విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ | శ్రీనివాసులు |
ఏపీటీడీసీ సీఈవో | విజయ |
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ | ధనుంజయ్‌రెడ్డి |
Last Updated : Feb 14, 2019, 11:19 PM IST