తెదేపాలోకి బిగ్బాస్-2 విజేత కౌశల్ ? - politics
ముఖ్యమంత్రి చంద్రబాబును బిగ్బాస్-2 విజేత కౌశల్ కలిశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కౌశల్ తెదేపాలోకి చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, వీరిద్దరి మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
కౌశల్ చిత్రం
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,బిగ్బాస్-2 విజేత కౌశల్ భేటీ అయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసులుతోవచ్చి చంద్రబాబునుకలిసిన కౌశల్... తెదేపాతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కౌశల్ రాకనుసీఎం ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేస్తానని కౌశల్ చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపాడు.