ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమ్మె వద్దు... చర్చలకు రండి..!? - ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను విరమింపజేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. సమ్మె నోటీసు ఇచ్చిన ఐక్య కార్యాచరణ సమితి బాధ్యులను ఉన్నతాధికారులు చర్చలకు ఆహ్వానించారు.

ఐకాస నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల చర్చలు

By

Published : Jun 6, 2019, 3:06 AM IST

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగకుండా ఆపడానికి యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి రావాలని కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆహ్వానించారు. గతనెల 9న 27 డిమాండ్లతో ఐకాస నేతలు సమ్మెనోటీసు ఇచ్చారు. కార్మికులు సమ్మెకు దిగే గడువు సమీపిస్తుండటంతో అధికారులు చర్చలకు సిద్ధమయ్యారు.

కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లించాలన్న కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్​ను ఆర్టీసీ ఇప్పటికే పరిష్కరించింది. కార్మికులకు చెల్లించాల్సిన 40 శాతం బకాయిలు విడుదల చేసింది. ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపు, సిబ్బంది కుదింపు నిర్ణయాలు ఉపసంహరించుకోవడం సహా... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం... నష్టాలను ప్రభుత్వమే భరించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల పరిష్కారంపై కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇవాళ చర్చలు జరపనున్నారు.

ఐకాస నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల చర్చలు

ఇదీ చదవండీ...26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

ABOUT THE AUTHOR

...view details