ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ నలుగురిని హాజరుపర్చండి!

నలుగురు సహచర ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైదరాబాద్​లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ దాఖలు చేసిన పిటిషన్​ను తెలంగాణ హై కోర్టు విచారించింది. రేపు నలుగురినీ తమ ముందు హాజరుపరచాలని ప్రతివాదులను ఆదేశించింది.

ఐడీ గ్రిడ్స్ కేసులో మలుపు

By

Published : Mar 3, 2019, 10:53 PM IST

Updated : Mar 3, 2019, 11:30 PM IST

ఐడీ గ్రిడ్స్ కేసులో మలుపు
ఐటీ గ్రిడ్స్ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను రేపు ఉదయం 10.30
గంటలకు తమ ఎదుట హాజరు పరచాలని ప్రతివాదులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.హైదరాబాద్ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కంపెనీలో నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదని ఆ సంస్థ సీఈవో అశోక్‌..తెలంగాణ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి,డీజీపీ,సైబర్‌ క్రైం విభాగం ఎస్‌హెచ్‌వో,మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

హౌస్ మోషన్ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్‌ చౌహాన్‌,జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌..సాయంత్రమే కుందన్​బాగ్‌లోని న్యాయమూర్తుల నివాసంలో విచారణ చేపట్టారు.పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలను వినిపించారు.నోటీసులు ఇవ్వకుండానే ఐటీగ్రిడ్‌ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు.పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు..సంస్థ ఉద్యోగులు భాస్కర్,ఫణి,చంద్రశేఖర్,విక్రమ్​ను రేపు న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించారు.

Last Updated : Mar 3, 2019, 11:30 PM IST

ABOUT THE AUTHOR

...view details