ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన పార్టీకి రావెల కిషోర్​ బాబు రాజీనామా - jenaseena

రావెల కిషోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​కు లేఖ పంపారు. రేపు మోదీ సమక్షంలో భాజపాలో చేరతారని సమాచారం

జనసేన పార్టీకి రావెల కిషోర్​ బాబు రాజీనామా

By

Published : Jun 8, 2019, 3:00 PM IST

Updated : Jun 8, 2019, 3:31 PM IST

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​కు లేఖ రాశారు. ఆయన భాజపాలో చేరనున్నట్లు అనుచరులు చెప్తుతున్నారు. ప్రస్తుతం రావెల తిరుపతిలో ఉన్నారు. రేపు ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి వస్తున్న దృష్ట్యా.... ఆయన సమక్షంలో భాపాలో చేరతారని సమాచారం.
ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెదేపాలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రి పదవి చేపట్టారు. అయితే రెండేళ్ల క్రితం మంత్రి పదవి పోవటంతో తెదేపాకు దూరంగా ఉన్న రావెల... 2018లో తెదేపాకు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపకపోవటంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపారు.

జనసేన పార్టీకి రావెల కిషోర్​ బాబు రాజీనామా
Last Updated : Jun 8, 2019, 3:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details