ETV Bharat / state
జగన్ ప్రమాణస్వీకారోత్సావానికి ప్రముఖుల రాక - kcr
నేడు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖలు హాజరుకానున్నారు.
జగన్ ప్రమాణస్వీకారోత్సావానికి ప్రముఖుల రాక
By
Published : May 30, 2019, 7:28 AM IST
| Updated : May 30, 2019, 8:01 AM IST
జగన్ ప్రమాణస్వీకారోత్సావానికి ప్రముఖుల రాక వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 12.23గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,రాజకీయ పార్టీల అధ్యక్షులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ ఈ వేడుకలో పాల్గొననున్నారు.
జగన్ ను కలవనున్న తెదేపా నాయకుల బృందం...
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు తెదేపా నేతలు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ మేరకు తెదేపా నేతల బృందం నేడు జగన్‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలవనుంది. తెదేపా ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు జగన్‌ను కలిసి తెదేపా అధినేత చంద్రబాబు తరఫున శుభాకాంక్షలు తెలపనున్నారు. అలాగే చంద్రబాబు అభినందన లేఖను జగన్‌కు అందజేయనున్నారు.
సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ కు పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరుపై బుధవారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. ఈకార్యక్రమానికి సీపీయం, సీపీఐ, భాజపా, కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు రానున్నారు. Last Updated : May 30, 2019, 8:01 AM IST