అమ్మ ఒడి...ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలి! - అమ్మ ఒడి
అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్, మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సీఎం జగన్కు విజ్ఞప్తి చేసింది. సచివాలయానికి వచ్చిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.కృష్ణా రెడ్డి సహా ప్రతినిధుల బృందం లేఖను ముఖ్య సలహాదారు అజేయ కల్లానికి అందించారు.
PRIVATE SCHOOL OWNERS DEMANDS AMMA VODI SCHEEME APPLY TO PRIVATE INSTITUTIONS
ప్రభుత్వ బడులను బలోపేతం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపిన సంఘం నేతలు... ప్రైవేటు బడులనూ కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకే అమ్మఒడి పథకం కింద 15 వేల రూపాయలు అందిస్తే...ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ప్రభుత్వ బడులకు తరలి వెళ్తారని వారు అభిప్రాయపడ్డారు. లాభాపేక్ష లేకుండా విద్యనందిస్తోన్న అనేక ప్రైవేటు పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని లేఖలో తెలిపారు.