విభజన చట్టంపై వ్యాజ్యం
ఆంధ్రప్రదేశ్ కు వెంటనే ప్రత్యేక హాదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరతూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని కోరారు.
ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ఇచ్చిన హామీలు, 2014 మార్చి 2న కేంద్రం ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఫిబ్రవరి వరకు 10,748 కోట్లు ఖర్చు కాగా 6,727 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం విడుదల చేసిందని...ఇంకా 4,021 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని పిటిషన్ లో కొణతాల ప్రస్తావించారు. పిల్ స్వీకరించి విచారణ జరపాలని కోరారు.