ప్రజావేదిక కూల్చివేతపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతి లేని మిగతా భవనాలనూ కూల్చివేయాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం వస్తుందని పవన్ అన్నారు.
జులై రెండో వారంలో గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు నాయకులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు పవన్ వెల్లడించారు.