గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు మళ్లించే ప్రతిపాదికపై ప్రాథమిక కసరత్తు అనంతరం జులై 3న ఇరురాష్ట్రాల అధికారులు భేటికావాలని నిర్ణయించినట్లు రాష్ట్ర జలవనురుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిన్న తెలంగాణ అధికారులతో రాష్ట్ర సాగునీటి నిపుణులు సమావేశమయ్యారు. ప్రధానంగా మూడు చోట్ల నుంచి నీటిని ఎత్తిపోయాలనే ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు సాగిస్తున్నట్లు సమా
నదీ జలాల మళ్లింపుపై ఇరురాష్ట్రాల అధికారులు జులై 3న భేటీ !
గోదారి జలాలను మళ్లించే విషయమై ఇరు రాష్ట్రాల ఉన్నాతాధికారులు జులై 3న మరోసారి భేటి కానున్నట్లు సమాచారం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటిని మళ్లించే ప్రతిపాదికపై చర్చించనున్నారు.
ప్రతిపాదిత మార్గంపై కసరత్తు
పోలవరం ఎగువ నుంచి మళ్లించే ప్రతిపాదిత మార్గంపై కసరత్తు చేసి ఒక అవగాహనకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రావతి దిగువన రాంపూర్, పాత దుమ్ముగూడెం ప్రతిపాదనలతో పాటు పోలవరం ఎగువ నుంచి మళ్లించే అంశంపైనా అధికారులు కొంత కసరత్తు చేశారు. కాలువ ద్వారా శ్రీశైలానికి మరో ఉప కాలువ ద్వారా నాగార్జునసాగర్‌కు చెరో 2 టీఎంసీలు మళ్లించడమే మేలని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. తదనుగుణంగానే ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం.