ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోగ్య రంగానికి 12 వేల కోట్లు కావాలి! - proposals

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు. దీనిలో భాగంగా వైద్యశాఖకు గతేడాది కంటే ఎక్కువ మొత్తం కేటాయించాలని అడిగే యోచనలో ఉన్నారు.

ఆరోగ్య రంగానికి 12 వేల కోట్లు కావాలి!

By

Published : Jun 29, 2019, 6:42 AM IST

ఈ ఏడాది బడ్జెట్‌లో... వైద్యశాఖకు 12 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది ఆరోగ్య రంగానికి 10 వేల కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు తేవాలని.. అదనంగా మరికొన్ని సేవలను కేటాయించాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రకారం ఆరోగ్యశ్రీకి బడ్జెట్ పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గతేడాది ఈ పథకానికి 800 కోట్లు కేటాయించగా... ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని కోరనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details