గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్
ఇక 50 ఏళ్లు నిండిన గిరిజనులంతా పింఛను తీసుకోవడానికి అర్హులే. వయోపరిమితిని కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ చిహ్నం
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి ఎంత గానో కృషి చేస్తోందనడానికి పింఛన్ల రెట్టింపు ఓ ఉదాహరణ. ప్రభుత్వం ఆ దిశగా మరెన్నో పథకాలను ప్రజా ప్రగతి కోసం ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే గిరిజనులకు 50 ఏళ్లకే వృద్ధ్యాప్య పింఛన్ అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లుగా ఉన్న వయోపరిమితిని 50 సంవత్సరాలకు కుదించింది. అర్హులైన గిరిజనుల వివరాలు నమోదు చేయాలనీ ఎంపీడీవోలకు సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
Last Updated : Feb 10, 2019, 8:54 PM IST