ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజాం సొమ్ములు దక్కేదెవరికో? - nizam

హైదరాబాద్​ ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ దేశ విభజన సమయంలో లండన్​లోని ఓ బ్యాంకులో 3.5కోట్ల పౌండ్లను దాచాడు. ఈ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు చెబుతుంటే... అది తమ సొమ్మే అంటోంది పాకిస్థాన్​. దశాబ్దాలుగా నలుగుతున్న నిజాం సొమ్ముల వివాదంపై మరో ఆరు వారాల్లో బ్రిటన్​ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

నిజాం సొమ్ములు దక్కేదెవరికో

By

Published : Jun 26, 2019, 12:59 PM IST

దేశ విభజన సమయంలో లండన్‌లోని ఓ బ్యాంకులో హైదరాబాద్‌ ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 3.5 కోట్ల పౌండ్లను దాచాడు. ప్రస్తుతం దాని విలువ 300 కోట్లు. భారత్​, పాకిస్థాన్​ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న న్యాయవివాదం బ్రిటన్​ హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. కొన్ని వారాల్లో తీర్పు రాబోతోంది.

నిజాం వారసులకే దక్కనుందా?
లండన్​లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌ పీఎల్‌సీలో ఈ నిధులు ఉన్నాయి. 1948లో హైదరాబాద్‌ నిజాం నుంచి పాకిస్థాన్‌లోని బ్రిటన్‌ హై కమిషనర్‌కు 1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్‌లు బదిలీ అయ్యాయి. ఆనాడు పాక్‌లో చేరాలా..? లేక భారత్‌తో కొనసాగాలా..? అనే సంశయంలో నిజాం రాజు ఉన్నారు. ఆ తర్వాత తన నిధులను తిరిగివ్వాలని ఆయన కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆ సొమ్ము పెరుగుతూ 3.5 కోట్ల పౌండ్లకు చేరింది. ఈ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు వాదిస్తుండగా.. దీనికి భారత్‌ మద్దతు పలుకుతోంది.

మరో ఆరువారాల్లో తీర్పు:
పాక్‌ మాత్రం అది తమ సొమ్మేనంటోంది. ఆ డబ్బు.. ఆనాడు భారత ‘దాడి’ నుంచి రక్షించుకోవడానికి హైదరాబాద్‌కు ఆయుధాల సరఫరా చేసినందుకు ఉద్దేశించిందని పాక్‌ ప్రభుత్వం వాదిస్తోంది. న్యాయమూర్తి జస్టిస్‌ మార్కస్‌ స్మిత్‌ ఈ కేసుపై రెండువారాల పాటు విచారణ సాగించారు. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. దాదాపు ఆరు వారాల్లో తీర్పు రావొచ్చని భావిస్తున్నారు. నిజాం రాజు ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు చెందిన నిధులకు ‘లబ్ధిదారైన’ యజమాని ఎవరన్నది కోర్టు తేల్చాల్సి ఉంది. నిజాం వారసులిద్దరి వయసు 80 దాటింది. ‘‘తాత కానుకను అందుకోవడానికి ముకరంజా, ఆయన సోదరుడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన విచారణ తుది పరిష్కారానికి దారితీస్తుందని ఆశిస్తున్నాం.. అని నిజాం వారసుల తరఫు వాదనలు వినిపిస్తున్న న్యాయ సంస్థ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details