ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి మంత్రమా.... దూకుడు వ్యూహమా....

నెల్లూరు రాజకీయం మారుతోంది. నెల్లూరు పట్టణంలో పాగా వేయాలనుకుంటున్న అధికార పార్టీ...ఫ్యాన్​ను పక్కకు నెట్టేయాలనుకుంటోంది. సైకిల్​కు ఎంట్రీ లేకుండా...చేయాలని వైకాపా వ్యూహాలు రచిస్తోంది. మరీ మంత్రిగా పని చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అనుభవం నెగ్గుతుందా? ప్రతిపక్షంలో ఫైర్​ బ్రాండ్‌గా పేరొందిన పంతం నెరవేరుతుందా?

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-March-2019/2834127_1056_8efe16d6-28ce-4408-809e-fefd4b429199.png

By

Published : Mar 29, 2019, 10:02 AM IST

అభివృద్ధి మంత్రమా.... దూకుడు వ్యూహమా....

రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరుది ప్రత్యేక స్థానం. ప్రతిపక్షానికి అడ్డాగా మారిన నెల్లూరు అర్బన్​పై తెదేపా కన్నేసింది. బరిలో మంత్రి నారాయణను దించింది. సమరంలో ఎవరున్నా...సీటు తమదేనని వైకాపా సవాల్ విసురుతోంది. ఫ్యాన్ పార్టీలో ఫైర్​ బ్రాండ్​గా పేరొందిన అనిల్ కుమార్​ను ఎలాగైనా...ఓడించాలని కసితో తెదేపా ఉంది. నెల్లూరు కోటపై ఇరుపార్టీలూ ధీమాతో ఉన్నాయి.

ప్రత్యక్ష బరిలోకి నారాయణ
నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మంత్రి పొంగూరు నారాయణ, వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్, జనసేన తరఫున వినోద్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మంత్రి నారాయణ మెుదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. నగరంలోని వీఆర్ కళాశాల లెక్చరర్​గా పని చేసిన ఆయన... 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెదేపా విజయానికి కృషి చేశారు. ఈ సేవలు గుర్తించిన చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నారాయణ రాష్ట్ర రాజకీయాలతోపాటు, నెల్లూరుకు ఎక్కువ సమయం కేటాయించారు. నాలుగేళ్లుగా నెల్లూరులో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశారు. ప్రస్తుతం తెదేపాలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కలసికట్టుగా నారాయణ గెలుపునకు కృషి చేస్తున్నారు.

వైకాపా నుంచి అనిల్
వైకాపా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. యువనాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. అభివృద్ధి పనులు చేయలేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నిధులు కేటాయించనందుకే అభివృద్ధి జరగలేదని ప్రచారంలో చెబుతున్నారు. మంత్రి నారాయణ చేసిన పనుల్లో అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని విమర్శిస్తున్నారు. గెలుపు వైకాపాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు నగరంలో పోటీ 2 ప్రధాన పార్టీల మధ్యే ఉంది. తమ నాయకుడు పవన్ కల్యాణ్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే తనను గెలిపిస్తుందని జనసేన అభ్యర్థి వినోద్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. జనసేన జెండా ఎగరేస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details