ఉదయం 8. గంటలకు మహాత్ముడికి ఘననివాళి అర్పించిన చంద్రబాబు... అక్కడ్నుంచి నేరుగా దిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. అక్కడున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. దీక్షకు కూర్చున్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని.. కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న చూపుతున్న నిర్లక్ష్యాన్ని జాతీయ స్థాయిలో చాటారు. దేశంలోని ఎన్డీఏతర ప్రధాన రాజకీయ పక్షాలన్నీ చంద్రబాబకు మద్దతు పలికాయి. పలువురు జాతీయ నేతలు స్వయంగా దీక్షాస్థలికి వచ్చిన ఆయనకు సంఘీభావం తెలిపారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా.. దేశం మొత్తం రాష్ట్రానికి అండగా... నిలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీక్ష చేయడానికి కారణాలు వివరించిన ఆయన .. గుంటూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
చంద్రబాబు చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో మద్దతు లభించింది. జాతీయ స్థాయి నేతలంతా దీక్షా స్థలికి చేరుకొని... సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను..విస్మరించి.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ వంటి నేతలంతా...ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్, కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఆజాద్, శరద్ పవార్, జైరాం రమేష్ దీక్షా వేదిక వద్దకు వచ్చి మద్దతు పలికారు. పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫోనులో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ ద్వారా దన్నుగా నిలిచారు.
ఎవరేమన్నారంటే....
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ఈ ప్రధాని పెడచెవిన పెట్టారు. దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ఏపీ ఈ దేశంలో భాగంకాదా... ప్రధాని ఎక్కడికెళ్తే అక్కడి పాట పాడతారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండానే అబద్ధాలు చెబుతారు. మోదీకి విశ్వసనీయత లేదు... ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. ఏపీ ప్రజల సొమ్ము దోచి అంబానీకి కట్టబెట్టారు.
-రాహుల్‌గాంధీ