ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"క్లాట్" ర్యాంకర్లకు లోకేష్ అభినందన - CLAT

క్లాట్-2019 ప్రవేశ పరీక్షల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ చూపడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

"క్లాట్" ర్యాంకర్లకు లోకేష్ అభినందన

By

Published : Jun 16, 2019, 3:08 PM IST

క్లాట్-2019 ప్రవేశ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఫలితాలు సాధించి దేశంలోని అత్యున్నత న్యాయ కళాశాలల్లో ప్రవేశం సాధించడం తమ కళాశాలకు గర్వకారణమని నారా లోకేష్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన లా సెట్ 2019 పరీక్షల్లో కూడా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులని సాధించి అత్యున్నత కళాశాలల్లో ప్రవేశం పొందారని తెలిపారు. లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థినులు, గతంలో కంటే అత్యున్నత ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందానికి, ట్రస్టీలకు అభినందనలు తెలియజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details