తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్వోలు ఇచ్చిన 17సీ ఫారంతో పోల్చుకుని లెక్కింపు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి పత్రాలు తేవద్దని ఆర్వోలు చెప్పడం సరికాదన్న కనకమేడల... పోలింగ్ నాటి వివరాలతో సరిపోల్చుకునే అవకాశం ఏజెంట్లకు ఇవ్వాలని కోరారు.
''వీవీప్యాట్ల లెక్కింపు ఉన్నందున ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే ఏజెంట్లకు భోజన సదుపాయాలు కల్పించండి. ఏజెంట్లను మధ్యలో బయటకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది. భద్రతను కట్టుదిట్టం చేయండి'' అని సీఈసీని కోరారు... కనకమేడల.